ఎస్‌ఆర్‌ఆర్‌లో సహజ వ్యవసాయంపై అతిథి ఉపన్యాసం

సహజ వ్యవసాయంపై అతిథి ఉపన్యాసం
వ్యవసాయాన్ని సుస్థిర వ్యవస్థాపకత గా మార్చుకుని జీవన ప్రమాణాలను పెంచుకోవాలి.. డాక్టర్‌ కె భాగ్యలక్ష్మి
అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :
మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర ఆధ్వర్యాన డాక్టర్‌ ఏపీజే అబ్ధుల్‌ కలాం యువజన సంఘం సహకారంతో ‘‘సహజ వ్యవసాయం – సుస్థిర వ్యవసాయ భవిష్యత్తు’’ అనే అంశంపై మంగళవారం అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో కిసాన్‌ అంగాడి వ్యవస్థాపకులు మారికంటి గోపాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని సహజ వ్యవసాయం, వ్యవస్థాపకత.. సుస్థిర జీవనోపాధులపై అతిథి ఉపన్యాసం చేశారు.. సహజ వ్యవసాయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సహజ వ్యవసాయం ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి వ్యవసాయాన్ని సుస్థిర వ్యవస్థాపకత గా మార్చుకుని జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆమె సూచించారు. కళాశాల బోటనీ విభాగాధిపతి డాక్టర్‌ జీ. స్వప్న మాట్లాడుతూ బీఎస్సీ బోటనీ అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ విద్యార్థులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.


గోపాలకృష్ణకు సత్కారం
విద్యార్థులను వ్యవస్థాపకత.. సుస్థిర అభివృద్ధి వైపు ప్రోత్సహిస్తున్న కిసాన్‌ అంగాడి వ్యవస్థాపకులు మారికంటి గోపాలకృష్ణ, శబరిని కళాశాల ప్రిన్సిపాల్‌ కె భాగ్యలక్ష్మి, జీ స్వప్ప కళాశాల అధ్యాపకులు విద్యార్ధులతో కలిసి సత్కరించారు. కార్యక్రమంలో బోటనీ విభాగ అధ్యాపకులు వి. పద్మావతి, శ్రీనివాస్‌ రెడ్డి , కాంత శ్రీ తదితరులు పాల్గొని సహజ వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకున్నారు

Views: 420

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 546 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 154 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌