నేడు శతాధిక వృద్దుల సత్కారం

 

శతాధిక వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవాలి
డాక్టర్‌ చల్లా హరికుమార్‌
అమరావతి టుడేప్రతినిధి:
దుర్గాపురం విజయ్‌ నర్శింగ్‌ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించనున్న 12వ శతాధిక వృద్ధుల సత్కారంకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ చల్లా హరికుమార్‌ తెలిపారు. స్ధానిక దుర్గాపురం విజయ్‌ నర్శింగ్‌ కళాశాలలో శనివారం శతాధిక వృద్ధుల సత్కారం కార్యక్రమంలో భాగంగా వలంటీర్‌లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన వైస్‌ ఛైర్మన్‌ తేజ్‌రాజ్‌ సోలంకీ ట్రస్టీలతో కలిసి కార్యాచరణ గురించి వివరించారు. పది మంతి శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల స్వయంగా దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని అన్నారు. అంతటి మహత్‌ భాగ్యంను ఆదివారం జరగబోయే శతాధిక వృద్దుల సత్కారం కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవాలని తెలిపారు. తాము ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ట్రస్ట్, దాతల సహకారంతో ఉమ్మడికృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 14 మంది శతాధిక వృద్ధులను గుర్తించి ప్రముఖుల చేతులమీదుగా సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టీలు తట్టి అర్జునరావు, ఎన్‌వీయూ సతీష్‌కుమార్, పీ లక్ష్మీనరసింహరావు, వరప్రసాద్, వెంకటేష్‌ గోదావరి తదితరులు పాల్గొన్నారు.

Views: 112

  • Related Posts

    • SuryaSurya
    • October 29, 2026
    • 0 views
    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    నగర అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని …

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.