
శతాధిక వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవాలి
డాక్టర్ చల్లా హరికుమార్
అమరావతి టుడేప్రతినిధి:
దుర్గాపురం విజయ్ నర్శింగ్ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించనున్న 12వ శతాధిక వృద్ధుల సత్కారంకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్ తెలిపారు. స్ధానిక దుర్గాపురం విజయ్ నర్శింగ్ కళాశాలలో శనివారం శతాధిక వృద్ధుల సత్కారం కార్యక్రమంలో భాగంగా వలంటీర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన వైస్ ఛైర్మన్ తేజ్‌రాజ్ సోలంకీ ట్రస్టీలతో కలిసి కార్యాచరణ గురించి వివరించారు. పది మంతి శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల స్వయంగా దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని అన్నారు. అంతటి మహత్ భాగ్యంను ఆదివారం జరగబోయే శతాధిక వృద్దుల సత్కారం కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవాలని తెలిపారు. తాము ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ట్రస్ట్, దాతల సహకారంతో ఉమ్మడికృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 14 మంది శతాధిక వృద్ధులను గుర్తించి ప్రముఖుల చేతులమీదుగా సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టీలు తట్టి అర్జునరావు, ఎన్వీయూ సతీష్‌కుమార్, పీ లక్ష్మీనరసింహరావు, వరప్రసాద్, వెంకటేష్ గోదావరి తదితరులు పాల్గొన్నారు.
Views: 112







