ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం


59 సంవత్సరాల తరువాత రెండోసారి కలిసిన పూర్వ విద్యార్ధులు
అమరావతి టుడే ప్రతినిధి:
విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్‌ శాఖ మాజీ అదనపు సంచాలకుడు డాక్టర్‌ కె. నరసింహారెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథులుగా నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఎంఏ), ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు, ఐఎంపీసీఓపీఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. భాను ప్రకాష్, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి. బుల్లయ్య పాల్గొని మాట్లాడారు. 59 సంవత్సరాల తరువాత ఇక్కడ మరోసారి కలవటం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. విద్యాభ్యాస సమయంలో ఏర్పడిన స్నేహబంధాలు, గురువులతో అనుబంధం, వత్తిపరమైన ప్రయాణంలోని అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పూర్వ విద్యార్థుల మధ్య పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సమ్మేళనం వేదికగా నిలిచింది.కార్యక్రమం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా హరికుమార్‌ మాట్లాడుతూ ఎన్నో పనివత్తిడిలు ఉన్నప్పటికీ ఇక్కడ సమావేశానికి వచ్చి ఉత్సాహంగా గడిపిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. తరచూ కలుసుకోవటంతో పాటు తోచినంతలో సేవాకార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం. దినకర శర్మ, డాక్టర్‌ కె. అమృత్‌ కుమార్‌ చంద్‌ కీలక పాత్ర పోషించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉత్సాహంగా పాల్గొనడంతో పండుగ వాతావరణం కనిపించింది. అలుమ్ని మీట్‌ ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Views: 168

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో పేరం త్రివేణిరెడ్డి ప్రచారం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, తనకు ఒక్క అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల వేళ ప్రతి ఓటు కీలకంగా మారుతున్న…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌