
వల్లభనేని రాజేశ్వరికి అపూర్వ ఆదరణ
చేసిన అభివృద్ది గెలిపిస్తుంది.. వల్లభనేని రాజేశ్వరి
మరో అవకాశం ఇవ్వండి
అమరావతి టుడే ప్రతినిధి:
65వ డివిజన్‌లో టీడీపీ ప్రచారం జోరందుకుంది. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధి వల్లభనేని రాజేశ్వరి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తాను చేసిన అభివృద్ది సంక్షేమమే తనను గెలిపిస్తుందని రాజేశ్వరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఓటర్లు వల్లభనేని రాజేశ్వరికి మద్దతు ఇవ్వటం గమనార్హం
గడప గడపకు టీడీపీ..
ఇక్కడ డివిజన్‌లో కూటమి నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు. టీడీపీ డివిజన్ ఇంఛార్జి వల్లభనేని సతీష్, డివిజన్ అధ్యక్షులు తోట పాండు డివిజన్ ప్రజలతో మమేకం అయ్యి సమస్యలు పరిష్కరిస్తున్నారు. నిత్యం ప్రజలతో కలిసి మెలసి ఉండటంతో పాటు అధికారులకు ప్రజలకు వార«ధిగా పనిచేస్తున్నారు.
నిత్యం పాదయాత్ర
ఇక్కడ టీడీపీ అభ్యర్ధి ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం డివిజన్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్వయంగా ప్రతీ రోజు గడప గడపకు వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిస్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో ప్రజలు సైతం తక్కిన పార్టీలను మరిచిపోయారు.
చేసిన అభివృద్ది గెలిపిస్తుంది.. వల్లభనేని రాజేశ్వరి
తాను కార్పొరేటర్‌గా ఇక్కడ పనిచేసినప్పుడు చేసిన పనితీరు అభివృద్ది తనను గెలిపిస్తుందని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధి వల్లభనేని రాజేశ్వరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను 5 సంవత్సరాలపాటు పారదర్శకంగా ప్రజలకు సేవ అందించానని తాను అందించిన సేవ తనను ఎన్నికలలో గెలిపిస్తుందని అంటున్నారు. తనకు మరోమారు కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే సేవ చేస్తాననని రాజేశ్వరి హామీ ఇస్తున్నారు.
గెలుపు లాంఛనమే… తోట పాండు., డివిజన్ అధ్యక్షుడు
ఇక్కడ టీడీపీ గెలుపు లాంఛనమేనని టీడీపీ డివిజన్ అధ్యక్షుడు తోట పాండు అంటున్నారు. టీడీపీ డివిజన్ ఇంఛార్జి వల్లభనేని సతీష్, తనకు డివిజన్‌లో ప్రతీ ఇళ్ళు, ప్రతీ వ్యక్తితో పాటు అన్ని సమస్యలు తెలుసునని అన్నారు. ఇప్పటికే డివిజన్‌లో సమస్యలన్నింటినీ పరిష్కరించటం జరిగిందని.. రాబోయే రోజులలో డివిజన్‌ను మరింత అభివృద్ది చేస్తామని అన్నారు. డివిజన్ అభివృద్ది చెందాలంటే కూటమితోనే సాధ్యమని తోట పాండు అన్నారు.
Views: 1498






