65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.


కనీస పోటీ ఇవ్వలేకఫోతున్న వైసీపీ
ప్రచారంలో దూసుకుపోతున్న వల్లభనేని రాజేశ్వరి
మెజార్టీపైనే గురి …
అమరావతి టుడే ప్రతినిధి:
65వ డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గత ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన వల్లభనేని రాజేశ్వరికి టీడీపీ అధిష్టానం మరోమారు కార్పొరేటర్‌ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చింది. దీంతో డివిజన్‌లో తాను చేసిన అభివృద్ధి సంక్షేమంను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
నిత్యం ప్రజలతో మమేకం
ఇక్కడ కార్పొరేటర్‌ అభ్యర్ధి వల్లభనేని రాజేశ్వరి, ఆమె భర్త వల్లభనేని సతీష్‌ నిత్యం ప్రజలతో కలిసి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎన్నికల ప్రారంభానికి ముందునుంచే 365 రోజులు డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ గడపకు వెళ్లి పేరుతో పలకరించే చనవు పరిచయాలు వల్లభనేని సతీష్‌ స్వంతం. అతి సింపుల్‌గా డివిజన్‌« అధ్యక్షుడు తోట పాండుతో కలిసి ఎటువంటి ఆర్బాటం లేకుండా పాదయాత్ర చేయటం గమనార్హం
వైసీపీ బేజారు
ఇక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పసుపులేటి లక్ష్మీ అధికార పార్టీ అభ్యర్ధికి కనీస పోటీ సైతం ఇవ్వలేకపోతున్నారు. వైసీపీ క్యాడర్‌ బలహీనంగా ఉండటంతో పాటు టీడీపీ అభ్యర్ధి బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో పోటీ నామమాత్రంగా మారింది. ఏదో నామినేషన్‌ వేశాం కాబట్టి ప్రచారం చేయాలని చేయటం తప్ప గెలవాలనే తపనతో మాత్రం పోటీ జరగటం లేదు. గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి అంగిరేకుల గొల్లభామ టీడీపీ అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు కనీసం పోటీలేకుండా ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుంది.

 

 

Views: 672

  • Related Posts

    • SuryaSurya
    • October 29, 2026
    • 168 views
    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    నగర అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని …

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.