స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలదే కీ రోల్

ఇంటికో పారిశ్రామికవేత్త’ సంకల్పంతో పారిశ్రామిక విప్లవం
రూ. 10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్’ ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు
  ~మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :

రాష్ట్రంలో సూక్ష్మ పరిశ్రమలను చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ‘స్వర్ణాంధ్ర’ దార్శనికతను సాకారం చేయడంలో ఎంఎస్ఎంఈలు వెన్నెముకగా నిలుస్తాయని మంత్రి అన్నారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ అనే విప్లవాత్మక నినాదంతో గ్రామీణ, పట్టణ స్థాయిలలో స్థానిక ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ సమగ్ర పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం రూ. 10,000 కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్’ ఏర్పాటుకు ఆమోదం తెలపడం చారిత్రక నిర్ణయమని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం వికసిత్ భారత్ 2047 తో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యానికి గొప్ప ఊతాన్నిస్తుందన్నారు.

ముఖ్యంగా సూక్ష్మ స్థాయి నుంచి ఎదిగే క్రమంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మూలధన కొరతను ఈ ఫండ్ తీరుస్తుంది. ఆధునిక సాంకేతికత, గ్లోబల్ వాల్యూ చైన్లలో భాగస్వామ్యంతో మన ఎంఎస్ఎంఈలు ప్రపంచ స్థాయిలో పోటీపడతాయ‌న్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లకు ఈక్విటీ మద్దతు లభించి స్థానికంగా భారీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయ‌ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సత్వర అనుమతులతో పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Views: 98

  • Related Posts

    • SuryaSurya
    • October 29, 2026
    • 14 views
    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    నగర అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని …

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.