అందజేసిన ఎంపీ కేశినేని చిన్ని
అమరావతిటుడే ప్రతినిధి : సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, కేశినేని ఫౌండేషన్, జిజ్ఞాస ఆర్ట్స్ వర్క్స్ సంయుక్తంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గురువారం రామవరప్పాడు రింగ్ వద్ద సర్వీసు రోడ్ లో ఉన్న ఎం కన్వెన్షన్ లో బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొని, వివిధ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా మొత్తం ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రతిభావంతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారిని ఎంపీ కేశినేని చిన్ని అభినందించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ..విజయవాడ నగరంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, విద్యార్థులు, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా వివిధ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి, సొసైటీ ఫర్ వైబ్రేoట్ విజయవాడ సభ్యులు విజయవాడ ఉత్సవ్ సభ్యులు జిజ్ఞాస ఆర్ట్ వర్స్ సభ్యులు పాల్గొన్నారు.
Views: 112







