మున్సిపోల్స్ కు రిజర్వేషన్ల ఖరారు

 

మున్సిపోల్స్ కు రిజర్వేషన్ల ఖరారు

– 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీల్లో రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ పూర్తి
– మేయర్‌ స్థానాల్లో ఎస్టీకి ఒకటి.. ఎస్సీకి రెండు.. బీసీలకు ఐదు
– చైర్‌పర్సన్‌ పీఠాల్లో ఎస్సీలకు 14.. ఎస్టీలకు 3.. బీసీలకు 36
– మహిళలకు మొత్తం 59 స్థానాలు

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి :

రాష్ర్టంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్రంలోని 17 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ పదవులతో పాటు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రత్యేక కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ కేటాయింపులు చేపట్టింది. రిజర్వేషన్లు వెల్లడవడంతో ఆయా పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.

కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు ఇలా..

ఎస్టీ జనరల్‌: మంగళగిరి–తాడేపల్లి
ఎస్సీ మహిళ: కర్నూలు
ఎస్సీ జనరల్‌: రాజమహేంద్రవరం
బీసీ మహిళ: కాకినాడ, మచిలీపట్నం
బీసీ జనరల్‌: ఏలూరు, అనంతపురం, చిత్తూరు
జనరల్‌ మహిళ: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, గ్రేటర్‌ విశాఖపట్నం (జీవీఎంసీ)
అన్‌రిజర్వుడ్‌: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు

మునిసిపాల్టీల్లో ఇలా

రాష్ట్రవ్యాప్తంగా 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవులకు రిజర్వేషన్లకు సంబంధించిన వివ‌రాల‌ను ఎన్నికల అధికారి, కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ పి. సంపత్‌కుమార్‌ రిజర్వేషన్ల వివరాలను వెల్లడించారు. ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, బీసీలకు 36 స్థానాలు కేటాయించారు. జనరల్‌ మహిళలకు మరో 27 స్థానాలు కేటాయించడంతో మహిళలకు మొత్తం 54 పీఠాలు దక్కనున్నాయి. మిగిలిన 26 స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి కేటాయించారు.
​
​కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఇలా

– ఎస్టీ కేట‌గిరి గూడూరు – ఎస్టీ (మహిళ), అల్లూరు – ఎస్టీ (జనరల్), ఆత్మకూరు – ఎస్టీ (జనరల్).
​ – ఎస్టీ మ‌హిళ : కేటగిరీ చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల
– ఎస్సీ జనరల్ : ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల
– బీసీ మహిళ : ఆళ్లగడ్డ, సాలూరు, ఇచ్ఛాపురం, నర్సీపట్నం, ఎర్రగుంట్ల, జంగారెడ్డిగూడెం, పాలకొండ, తుని, పాలకొల్లు, కదిరి, పుంగనూరు, రాజంపేట, గుడివాడ, రాజాం, గూడూరు , గుత్తి, నందికొట్కూరు, ముమ్మిడివరం
– బీసీ జ‌న‌ర‌ల్ : పిడుగురాళ్ల, పుత్తూరు, బెళుగుప్ప/బేతంచర్ల, రామచంద్రపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మదనపల్లె, తాడిపత్రి, తిరువూరు, నంద్యాల, హిందూపురం, మడకశిర, నెల్లిమర్ల, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, తాడిగడప, బి.కొత్తకోట

​ మహిళా జనరల్ : కనిగిరి, కమలాపురం, కొవ్వూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆత్మకూరు, నరసాపురం, పాలస కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, అకివీడు, పొన్నూరు, భీమవరం, చిలకలూరిపేట, జగ్గయ్యపేట, అమలాపురం, మాచర్ల, ఆదోని, నాయుడుపేట, డోన్, బొబ్బిలి, రేపల్లె, పార్వతీపురం, పులివెందుల.

​ – అన్‌రిజర్వ్‌డ్ : తణుకు, తెనాలి, గురజాల, తాడేపల్లిగూడెం, అమలాపురం, యమ్మిగనూరు, కావలి, ప్రొద్దుటూరు, నందిగామ, కందుకూరు, మండపేట, దాచేపల్లి, నగరి, చిమటకూర్తి, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, గొల్లప్రోలు, అద్దంకి, పెద్దాపురం, ధర్మవరం, బడుగువెల (బుద్వేల్), దర్సి, మార్కాపురం, మైదుకూరు, నరసరావుపేట.

Views: 210

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 574 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌