స్టేట్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ అవార్డ్స్‌ – 2026

స్టేట్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లను గుర్తించి సత్కరించడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేశ్‌

అమరావతి టుడే ప్రతినిధి:

తమ తమ రంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తూ, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను అభినందిస్తూ అవార్డులతో సత్కరించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు.

గ్లోబల్‌ ఐకాన్స్‌ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘‘స్టేట్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ అవార్డ్స్‌ – 2026’’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతున్న వ్యక్తులను గుర్తించి, ప్రోత్సహించడం ద్వారా యువతకు స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలనే ఉత్సాహాన్ని ఇటువంటి కార్యక్రమాలు మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ప్రతిభకు తగిన గుర్తింపు, గౌరవం లభించినప్పుడు రాష్ట్ర అభివద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మంత్రి తెలిపారు. అక్టోబర్‌ 24న విజయవాడ క్లబ్‌లో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపడుతున్న గ్లోబల్‌ ఐకాన్స్‌ ఫోరం సొసైటీ జాతీయ అధ్యక్షులు చైతన్య జంగా, సెక్రటరీ జయ పటేరియా లను మంత్రి అభినందించారు.

డిజిటల్‌ రంగానికే పరిమితం కాకుండా వివిధ రంగాల ప్రతిభకు గుర్తింపు

అవార్డుల కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ చైతన్య జంగా, జయ పటేరియా మాట్లాడుతూ, ‘‘స్టేట్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌’’ అంటే కేవలం సోషల్‌ మీడియా లేదా డిజిటల్‌ రంగంలో ప్రభావం చూపుతున్న వారే కాకుండా, తమ తమ వత్తి, రంగాల్లో ప్రతిభతో ఇతరులను ప్రభావితం చేస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రతిభావంతులను కూడా గుర్తించి, ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతిభ, సజనాత్మకత, సామాజిక ప్రభావం, సేవా దక్పథం వంటి విభిన్న అంశాల్లో విశేష కషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రముఖుల సమక్షంలో అవార్డుల ప్రదానం

ఈ అవార్డుల కార్యక్రమంలో సినీ, రాజకీయ, వ్యాపార, కార్పొరేట్, మీడియా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, డిజిటల్‌ క్రియేటర్లు, వివిధ రంగాల్లో ప్రభావవంతమైన వ్యక్తులు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

‘‘మన అమరావతి – మన రాజధాని’’ సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యం

దేశ, విదేశాల్లో ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రతిభావంతుల భాగస్వామ్యంతో ‘‘మన అమరావతి – మన రాజధాని’’ అనే సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటని నిర్వాహకులు తెలిపారు.

పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో కోడె చైతన్య, డా. చిలకపాటి రామ్‌ చంద్, మిథాని ఈశ్వర్, రామిశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్ల నందు 98663 33787, 98486 69996 నందు సంప్రదించ గలరు.

Views: 728

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 574 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌