ఎల్ నినో ప్రభావంతో పెరిగిన డిమాండ్. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి టుడే ప్రతినిధి
ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గతేడాది ఇదే రోజుల్లో కేవలం 240 మిలియన్ యూనిట్లుగా ఉన్నరోజువారి వినియోగం ఇప్పుడు ఏకంగా 290 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు.
20 శాతం పెరిగిన డిమాండ్
అధిక ఎండలతో ఈ ఏడాది దాదాపు 20 శాతంపైగా విద్యు
త్ వినియోగం పెరిగిందని తెలిపారు.జెన్కో సంస్థ రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా పెరిగిన వినియోగంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బయట నుంచి కొనుగోళ్లు చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తున్నామనిమంత్రి స్పష్టం చేశారు.
కోతలు లేకుండా చర్యలు
గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలతో పవర్ కట్స్ లేకుండా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమణి తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి వారం విద్యుత్ శాఖపై సమీక్ష చేసి దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యలు
మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్ స్కేర్ సిటీ ఉందని మంత్రి గొట్టిపాటి చెప్పారు.అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నా… పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
Views: 84







