టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధిగా మట్ల రవీ.?

ఆశావహుల రేసులో ముందంజ
అందరివాడిగా మన్ననలు అందుకుంటున్న రవి
అమరావతి టుడే ప్రతినిధి:
మరి కొద్ది రోజులలో రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగనుంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కూటమి బలంగా ఉండటంతో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా బావిస్తుండటంతో గెలుపుగుర్రాలకే అవకాశం కల్పించాలని.. ఏ చిన్న అవకాశం చేజార్చుకోకూడదని భావిస్తున్నారు. ఈ నేపద్యంలో ఇప్పటికే ఆశావహుల స్క్రీనింగ్‌ జోరుగా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. గతంలో 30వ డివిజన్‌గా ఉండి డివిజన్‌ల పునర్విభనలో భాగంగా 66వ డివిజన్‌గా మారిన వినాయకనగర్‌ నుంచి కూటమి అభ్యర్ధిగా వినాయకనగర్‌ రెసిడెన్సియల్‌ వెల్ఫేర్‌ అసోసియోషన్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు మట్ల రవీంద్ర (రవి) కార్పొరేటర్‌ అభ్యర్ధి రేసులో ముందంజలో ఉన్నారు. జీవీఆర్‌నగర్, దావు బుచ్చయ్యకాలనీ, వినాయకనగర్, సాయినగర్‌ తదితర ప్రాంతాలలో రాజకీయాలకు అతీతంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. కాలనీ అభివృద్దిలో తనదైన ముద్ర వేశారు..ముఖ్యంగా బుడమేరు ముంపు సమయంలో ఆయన ప్రతీ ఒక్కరికీ అండగా నిలవటంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సీటు లాంఛన ప్రాయమే….
అందరికీ సుపరిచితుడు.. వివాద రహితుడు.. కాలనీ అభివృద్ది కారకుడుగా పనిచేసిన మట్ల రవికి కార్పొరేటర్‌ అభ్యర్ధిత్వం లాంఛన ప్రాయమేనని సర్వత్రా వినిపిస్తుంది. ఈయన ఇప్పటికే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని కలిసి తన పేరు కార్పొరేటర్‌ అభ్యర్ధిగా పరిశీలించాలని దరఖాస్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం…

అవకాశం ఇస్తే.. సేవ చేస్తా….మట్ల రవి
ఇప్పటి వరకు రెసిడెన్సియల్‌ వెల్ఫేర్‌ అసొసియోషన్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడుగా కాలనీ అభివృద్దికి కృషి చేశాను. కనీసం మౌలిక సదుపాయాలు లేని స్ధితి నుంచి అభివృద్ధిలో పోటీ పడేలా తీర్చిదిద్దాననే సంతృప్తి ఉంది. ఇప్పుడు తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే ప్రజలకు మరింత సేవలు చేయటంతో పాటు డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని మట్ల రవి తెలిపారు.

Views: 8750

  • Related Posts

    • SuryaSurya
    • October 29, 2026
    • 0 views
    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    నగర అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని …

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    కూటమితోనే నగర అభివృద్ధి.. అందరివాడు మట్ల రవీంద్ర

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.