కానిస్టేబుళ్లే పోలీసు వ్యవస్థకు వెన్నెముక

 

క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలి

హోంమంత్రి వంగలపూడి అనిత

అమరావతి టుడే ప్రతినిధి :

పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముకని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ బీటీసీ పరేడ్‌ గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఎన్నో అడ్డంకులను అధిగమించి కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయిందని, వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమన్నారు.
ప్రజలకు భరోసా కల్పించాలి
విపత్తులు, బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అనిత సూచించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు.
పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, సత్వర న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని అన్నారు.
రాజ్యాంగానికి అనుగుణంగా విధులు
రాజ్యాంగానికి అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా నీతి, నిజాయితీ, కర్తవ్య స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన 2047 విజన్‌లో కానిస్టేబుళ్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో, ప్రశాంతంగా ప్రజలకు సేవలందిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు.

Views: 84

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 588 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌