
వద్ధులను ఆదరించటం సామాజిక బాధ్యత
వద్దాప్యం శరానికేకాని మనస్సుకు కాదు
ఐజీ ఆకే రవికృష్ణ
అమరావతి టుడే ప్రతినిధి:
ప్రతీ ఏటా ఎన్నోవ్యయప్రయాసలకోర్చి శతాధిక వద్దులను గుర్తించి ఒక్కచోట చేర్చి వారికి సత్కారం చేయటం అభినందనీయమని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్‌పోలీస్(ఐజీ) ఈగల్ ఆకే రవికృష్ణ కొనియాడారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్శింగ్ కళాశాలలో వయోవధ్ధ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం దాత మంగీలాల్ సోలంకీ సహకారంతో శతాధిక వద్ధుల సత్కారం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ట్రస్టీలు, దాతలతో కలిసి శతాధిక వద్ధులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా అంతర్జాతీయ వయోవద్ధుల దినోత్సవం పురస్కరించుకుని 12 సంవత్సరాలుగా శతాధిక వద్ధులను సత్కరించటం అభినందనీయం అన్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలో వద్దాప్యం ఒక భాగం అని అటువంటి వద్దాప్యంలో వయోవద్ధులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత 18 సంవత్సరాలుగా వయోవద్దులకు సేవలు అందించటంతో ఆటలు పోటీలు నిర్వహించి ప్రోత్సహించటం మామూలు విషయం కాదని అన్నారు. వద్దాప్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని గుర్తించాలని అన్నారు. అలాగే వద్దులు అధికంగా సైబర్ నేరాలకు గురవుతున్నారని కావున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్ ,వైస్ ఛైర్మన్ తేజ్‌రాజ్ సోలంకీ మాట్లాడుతూ పది మంది శతాధిక వద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీస్సులు తీసుకుంటే సాక్షాత్తూ దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. వంద సంవత్సరాలు జీవించటం సామాన్య విషయం కాదని.. నూరు సంవత్సరాలు జీవించిన శతాధిక వద్దుల సందేశం ప్రజలకి అందజేయటంతో పాటు ప్రతీ ఒక్కరికీ దైవానుగ్రహం లభించాలని తాము శతాధిక వద్ధుల సన్మానోత్సవం ప్రతీ ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం శతాధిక వద్ధులు పద్మశ్రీ అన్నవరపు రామస్వామితో పాటు మరో 13 మందిని నూతన వస్త్రాలు, నగదు బహుమతి, నిత్యావసరకులు అందజేసి ఘనంగా సత్కరించారు. వయోవద్దులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అలాగే ట్రస్ట్‌కు సహకరిస్తున్న దాతలను ప్రముఖుల చేతులమీదుగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ తేజ్‌రాజ్ సోలంకీ, వీరమాచనేని కిషోర్, ట్రస్టీలు తట్టి అర్జునరావు, అమరా ఉమామహేశ్వరరావు, ఎన్‌వీయూ సతీష్‌కుమార్, ఎస్‌ఎన్ వరప్రసాద్, కె మధుసూధనరావు, పీ లక్ష్మీనరసింహరావు, బోండా సుజాత , వెంకటేష్ గోదావరి తదితరులు పాల్గొన్నారు.

Views: 476







