ఉత్సాహంగా 5కే మారధాన్‌ రెడ్‌రన్‌

హెచ్‌ఐవి నివారణలో యువత పాత్ర కీలకం… డాక్టర్‌ భానూనాయక్‌ 
యువత భాగస్వామ్యంతోనే హెచ్‌ఐవి రహిత సమాజం

అమ‌రావ‌తి టుడే, ప్ర‌తినిధి :

హెచ్‌ఐవి నివారణలో యువత పాత్ర కీలకం అని..యువత భాగస్వామ్యంతోనే హెచ్‌ఐవి రహిత సమాజం సాధ్యమని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ అండ్‌ టీబీ ఆఫీసర్‌ డాక్టర్‌ భానూనాయక్‌ అన్నారు. స్ధానిక బీఆర్టీఎస్‌ రోడ్డులో శనివారం రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలలో భాగంగా యువతీ యువకులకు 5కే మారధాన్‌ రెడ్‌రన్‌ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని క్లస్టర్‌ పోగ్రాం మేనేజర్‌ లంకపల్లి మధుసూధనరావు, ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీ యుగంధర్‌లతో కలిసి 5కే మారధాన్‌ రెడ్‌రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీయువకులు హెచ్‌ఐవి బారిన పడకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్‌ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదని.. యువతీ యువకులు సమష్టిగా హెచ్‌ఐవిపై పోరాటం చేసి హెచ్‌ఐవి రహిత సమాజ స్ధాపనకు సహకరించాలని అన్నారు.


విజేతలు రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపిక
17 నుంచి 25 సంవత్సరాలలోపు కళాశాల విద్యార్ధులకు విభాగాల వారీగా 5కే మారధాన్‌ రెడ్‌రన్‌ నిర్వహించి ప్రధమ బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ.7వేలు అందజేయటంతో పాటు రాష్ట్రస్ధాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. యువత సత్ప్రవర్తనతో జిల్లాను హెచ్‌ఐవి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. 5కే మారధాన్‌ రెడ్‌రన్‌ పోటీలలో పలు కళాశాలలకు చెందిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలు వీరే…
5కే మారధాన్‌ రెడ్‌రన్‌ పోటీలలో పురుషుల విభాగంలో
ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పీ వినయ్‌ ప్రధమస్ధానం, పీబీసిద్దార్ధ కళాశాలకు చెందిన బీ పవన్‌ ద్వితీయ స్ధానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో కాకతీయ జూనియర్‌ కళాశాలకు చెందిన ఎస్‌ సర్వజ్ఞ ప్రధమ స్ధానం, నున్నకు చెందిన డీ భవాని ద్వితీయ స్ధానంలో నిలిచి రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలలో పాల్గొన్నవారికి డాక్టర్‌ భానూనాయక్‌ చేతులమీదుగా పార్టిసిఫేషన్‌ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలోపీఓ మల్లేశ్వరరావు ఎన్టీఆర్‌జిల్లాలోని స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్దులు పాల్గొన్నారు.

Views: 896

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 574 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌