
హిమవర్షను అభినందించిన వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు
అమరావతి టుడే ప్రతినిధి
తిరుపతిలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీవరకు జరిగిన .శస్త్ర చికిత్స (జనరల్ సర్జరీ) నిపుణుల రాష్ట్రీయ వైద్యవిజ్ఞాన సదస్సులో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల జనరల్ సర్జరీ పీజీ విద్యార్ధి డాక్టర్ దువ్వూరు హిమవర్ష సత్తాచాటారు. ఈ సదస్సులో ‘పెద్ద ఉదర శ్రోణి ద్రవ్య రాశిగా వ్యక్తమైన‘ గ్యాస్ట్రోబ్లాస్టోమా‘ అను ఒక అరుదైన కేసు పై ఆమె చేసిన పోస్టర్ ప్రజెంటేషన్ కు ’బెస్ట్ – పోస్టర్’ బహుమతి లభించింది.ఈ సందర్బంగా సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు దువ్వూరు హిమవర్షను అభినందించారు. చిన్న వయస్సులోనే ఇంతటి ప్రతిభ చూపుతున్న హిమవర్ష భవిష్యత్తులో వైద్యరంగంలో మరింత ఉన్నతస్ధానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తక్కిన విద్యార్ధులు హిమవర్షను స్ఫూర్తిగా తీసుకుని వైద్యకళాశాల, నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శస్త్ర చికిత్స వైద్యవిభాగ అధిపతి డాక్టర్ జి. పద్మశ్రీ, ప్రొఫెసర్ కె. బి. ఎన్. ప్రభాకర్, ప్రొఫెసర్ జ్వలిత, అసోసియేట్ ప్రొఫెసర్ సుఫియా, అసోసియేట్ ప్రొఫెసర్ విజేత, అసిస్టెంట్ చంద్రకాంత్, బి. ఎస్. పి. యాదవ్, వెంకటేశ్వరులు తదితరులు ప్రత్యేకంగా ప్రశంసలు అందజేశారు.
ఫొటోలు 01––హిమవర్షను అభినందిస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడు కొండలరావు
Views: 532







