ముంచుకొస్తున్న తీవ్ర వాయు గండం


రెండు రోజుల్లో వాయుగుండం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం
నేడు రేపు భారీ వ‌ర్షాలు
వేట‌కు వెళ్లొద్ద‌ని మ‌త్స్య‌కారుల‌కు హెచ్చ‌రిక

అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి:

పశ్చిమ మధ్య, ఆనుకొని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి,వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు . ఇది ప్రస్తుతానికి పూరీ (ఒడిశా)కి 310 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి 310 కి.మీ., కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి 390 కి.మీ. విశాఖపట్నంకి తూర్పున 470 కి.మీ. దూరంలో ఉందని వెల్లడించారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమమధ్య, ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము సమయంలో తీవ్రవాయుగుండంగా విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వేట‌కు వెళ్లొద్దు

సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

మంగళవారం అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం అల్లూరి, పోలవరం,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గురు,శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శంఖవరంలో 60.7 మిమీ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం

సోమవారం సాయంత్రం 9 గంటల నాటికి కాకినాడ జిల్లా శంఖవరంలో 60.7 మిమీ, ఎన్టీఆర్ జిల్లా నందలూరులో 52.5మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 48.2మిమీ, నంద్యాల జిల్లా దుర్వేసిలో 45.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 45.3మిమీ,చిత్తూరు జిల్లా రామకుప్పంలో 41.2మిమీ, అనంతపురం జిల్లా డి.హీరేహాల్ 35.5మిమీ, చిత్తూరు అర్బన్ లో 34.2మిమీ, కర్నూలు జిల్లా పత్తికొండలో 31.5మిమీ, తిరుపతిలో 30.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Views: 126

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 630 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌