శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీటీడీ ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకిదేవీ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రలు చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు చర్చించారు.