ముగిసిన ఇంటింటికీ తెలుగుదేశం-2026

ఇంటింటికీ టీడీపీ-2026 గ్రాండ్ సక్సెస్..

47 రోజుల్లో 1.10 కోట్ల ఇళ్ల సందర్శంచిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

ఇంటింటికీ తెలుగుదేశం -2026 కార్యక్రమం కార్యకర్తల శ్రమకు చరిత్రాత్మక విజయం

రాష్ట్రంలోని 81.11 శాతం ఇళ్లను నేరుగా చేరుకున్న టీడీపీ శ్రేణులు

మైటీడీపీ యాప్‌తో ప్రతి సందర్శనను టెక్నాలజీతో ట్రాక్ చేసిన నారా లోకేష్

కార్యకర్తలకు అభినందనలు తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచిన ‘ఇంటింటికీ టీడీపీ – 2026’

అమరావతి:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యవేక్షనలో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం -2026 బృహత్తర కార్యక్రమం నేటితో ముగిసింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026’ రెండేళ్ల నమ్మకం – అభివృద్ధీ, సంక్షేమం కార్యక్రమం 47 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగినంది. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు 1,10,24,319 ఇళ్లను నేరుగా సందర్శించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,35,91,105 ఇళ్లలో 81.11 శాతం ఇళ్లను పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, పరిపాలనా సంస్కరణలను ప్రతి ఇంటికి నేరుగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం, క్రమశిక్షణ, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ లెవల్ కార్యకర్తలు సహా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న అన్ని స్థాయిల శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఒక్కరోజులోనే 19,405 బూత్‌లు

‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో కార్యకర్తల భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందో గణాంకాలే చెబుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన 40 రోజుల్లోనే కోటి ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించింది. ఒక్కరోజులో 19,405 బూత్‌లలో కార్యక్రమం నిర్వహణ. ఒక్కరోజులో 28,397 మంది కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పాల్గొనడం, ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో బూత్‌లు, కార్యకర్తలు పనిచేయడం రికార్డు. కార్యకర్తల అంకితభావానికి నిదర్శనంగా ఆగస్టు 8న ఒక్కరోజే 3,51,229 ఇళ్లను సందర్శించారు.

ప్రతి ఇంటి సందర్శనకు ఫోటో ఆధారం

‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం కేవలం కార్యకర్తల సంఖ్య, సందర్శనల అంచనాలకే పరిమితం కాలేదు. ప్రతి సందర్శనను టెక్నాలజీ ఆధారంగా నమోదు చేశారు. సందర్శించిన ఇళ్లలో 82 శాతం ఇళ్ల సందర్శనలకు ఫోటో ఆధారం ఉంది. అంటే ప్రతి 10 ఇళ్లలో దాదాపు 8 ఇళ్ల సందర్శనలను ఫోటో ద్వారా ధ్రువీకరించారు. ప్రతి ఇంటి సందర్శన వివరాలను మైటీడీపీ యాప్‌లో అప్లోడ్ చేసి, కార్యక్రమం ఎంత మేరకు జరిగింది అనే విషయాన్ని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్‌గా నమోదు చేశారు.

కార్యకర్తల శ్రమను టెక్నాలజీతో ట్రాక్ చేసిన నారా లోకేష్

‘ఇంటింటికీ టీడీపీ-2026’ కార్యక్రమంలో కార్యకర్తలు చేసిన ప్రతి కృషిని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి నారా లోకేష్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమం పురోగతిని పరిశీలిస్తూ.. అవసరమైన సూచనలు, దిశానిర్దేశం చేశారు. దీంతో కార్యకర్తల కష్టం కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా డిజిటల్‌గా కూడా నమోదైన కార్యక్రమంగా ‘ఇంటింటికీ టీడీపీ-2026’ నిలిచింది.

ఇది కార్యకర్తల విజయం

47 రోజుల పాటు సాగిన ఈ మహా కార్యక్రమం సాధించిన ఫలితాల వెనుక వేలాది మంది టీడీపీ కార్యకర్తల శ్రమ ఉంది. 47 రోజుల పాటు ఎండ, వాన సైతం లెక్కచేయకుండా కేటాయించిన ప్రతి ఇంటినీ సందర్శించి కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనా విజయాలు, అందిస్తున్న సంక్షేమం కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసింది కార్యకర్తలే. వీరి సమష్టి కృషే ‘ఇంటింటికీ టీడీపీ-2026’ విజయానికి కారణం. ‘ఇంటింటికీ టీడీపీ-2026’ గ్రాండ్ సక్సెస్‌ కార్యకర్తల విజయానికి నిదర్శనం.

కార్యకర్తతే అధినేత.. రికార్డు స్థాయిలో సాగిన ఇంటింటికి కార్యక్రమం

ఇంటింటికీ టీడీపీ-2026’ గ్రాండ్ సక్సెస్‌ వెనుక అసలు అధినేతలు కార్యకర్తలే అని స్పష్టమవుతోంది. రికార్డు స్థాయిలో సాగిన ఈ ఇంటింటికి కార్యక్రమంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు చూపిన అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర కృషి వల్లనే ఇంతటి చరిత్రాత్మక ఫలితం సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రశంసిస్తూ పల్లా గారు కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యకర్తలే పార్టీ బలం అని, వారి శ్రమే ఈ రికార్డు స్థాయి సాధనకు కారణమని పల్లా గారు అభినందనలు వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో స్థానిక సంస్థల్లో కూడా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top